తాడిపత్రి: మండల పరిధిలోని కావేటిసముద్రానికి చెందిన వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే. కావేటిసముద్రం గ్రామానికి చెందిన రాము ఆ గ్రామానికి వెళ్లే దారిలో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అక్కడున్న స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.