హర్యానాలో డీఎస్పీని ట్రక్కుతో ఢీకొట్టి చంపిన ఘటన మరువక ముందే గుజరాత్‌లోనూ అదే తరహా ఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రం బోర్సాద్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో దానిని ఆపేందుకు కరణ్ సింగ్ రాజ్ అనే కానిస్టేబుల్ యత్నించాడు. అయితే డ్రైవర్ ఆ ట్రక్కును కానిస్టేబుల్‌పై నుంచి పోనిచ్చాడు. తీవ్రగాయాల పాలైన కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa