ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులం ఆధారంగా దేశభక్తిని గుర్తిస్తారా...కేంద్రంపై మండిపడ్డ ప్రతిపక్షాలు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 11:47 PM

అగ్నిపథ్ నియామకాలలో కులం చిచ్చురగిలింది.  అగ్నిపథ్ మరోసారి వివాదాస్పదం అయింది. రిక్రూట్‌మెంట్‌లో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రతిపక్షాలు, బీజేపీ నేత కూడా ఆరోపించారు. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ అభియోగాన్ని కొట్టిపడేశారు. అది ఒక పుకారుగా అభివర్ణించారు. ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జేడీయూ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కుల ధ్రువీకరణ అవసరాన్ని సూచించే రిక్రూట్‌మెంట్ పత్రానని ట్వీట్ చేశారు.


దాంతోపాటు కులాల ద్వారానే వ్యక్తుల దేశభక్తిని గుర్తిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం మళ్లీ ఆలోచించాలని సూచించారు. అలాగే చరిత్రలో మొదటిసారి సైనిక నియామకాల్లో కుల, మతాల గురించి ప్రస్తావన వచ్చిందని, దళితులు, గిరిజనులకు సైన్యంలో అవకాశం ఇవ్వారా.. ? అని సంజయ్ సింగ్ నిలదీశారు.


దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. విపక్ష నేతలు సైన్యాన్ని అవమానించారని ఆరోపణలు చేశారు. ఆందోళనలు ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాగే ఇది ఒక పుకారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. "ఇది పుకారు అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. స్వతంత్రానికి ముందు అమల్లో ఉన్న (రిక్రూట్‌మెంట్) వ్యవస్థను కొనసాగిస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు." అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ స్వతంత్రానికి పూర్వం నాటిదని బీజేపీ అధికారి ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com