ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి గన్స్ కలకలం రేగింది. విమానాశ్రయంలో థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఒక జంట 45 తుపాకులతో పట్టుబడిన వారం రోజుల్లోనే లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ గన్ కలకలం రేపింది. ఎయిర్‌గన్స్‌తో పాటు టెలిస్కోప్‌ను కూడా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి డిక్లరేషన్, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా గ్రీన్ ఛానల్ నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రెండు ఎయిర్ గన్స్‌తో పాటు వాటికి సంబంధించిన సామగ్రి ఉండటంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. లగేజ్ బ్యాగ్ విదేశీ ఎయిర్ గన్స్‌ను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయుధాల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రీన్ ఛానల్ నుంచి వెళ్లేందుకు వ్యక్తి ప్రయత్నించాడని.. గతంలో ఏమైనా ఆయుధాలు సరఫరా చేశాడా అని ఆరా తీసే పనిలో అధికారులు ఉన్నారు.