ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో విపక్షాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ షాకిచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు టీఎంసీ తాజాగా ప్రకటించింది. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు సరిగా లేదని, అందుకే, తాము విపక్షాల అభ్యర్థికి మద్దతును ఇవ్వబోమని తెలిపింది.