గతంలో చెప్పిన దానికి భిన్నంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా సీఎం తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 2017లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన ట్వీట్‌ను గుర్తు చేశారు. తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ప్రతిపక్ష నేతగా 'మిమ్మల్ని' వేధించిన అంశం.. మీరు అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలను ఎలా వెంటాడుతున్నారు.. ఇకనైనా మేల్కోండి ముఖ్యమంత్రి గారూ.. ఇప్పటికైనా ఆపండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అక్రమ అరెస్టులు, వేధింపుల్ని ఆపాలని.. ప్రభుత్వానికి సిగ్గు చేటు అంటూ టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నాగబాబు టార్గెట్ చేశారు.