రాజమండ్రి రూరల్ రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల నేడు శాటిలైట్ సిటీ గ్రామంలో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులని అడిగి తెలుసుకున్నారు. గోరంట్ల మాట్లాడుతూ మన శాసనసభ్యులు శ్రీగోరంట్ల బుచ్చయ్య చౌదరి శాటిలైట్ సిటీ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటి నుండి గ్రామాన్ని చాలా గొప్పగా రూపు మార్పులు చేసి అభివృద్ధి చేశారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలుకు వరద నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు మలేరియా, డెంగు మరియు అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ముఖ్యంగా ఇంటి పరిసరాలలో చెత్త కానీ పనికిరాని టైర్లు కానీ ఇంటి పరిసరాలలో ఉంచుకోకూడదు అని అందరూ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రతలు తీసుకోవాలి అని ఆయన తెలియజేసారు. ఈ సందర్బంగా శాటిలైట్ సిటీ గ్రామంలో A, B, C బ్లాక్ లో ట్రాక్టర్ పై మోటార్లతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం జరిగింది.