ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో గల తుంగభద్ర జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, మంగళవారం నాటికి నీటి మట్టం 1632.81 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై జలాశయం 12 గేట్లను ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం 105.025 టీఎంసీలుగా ఉంది.