ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. సక్సెస్ కోసం టీమ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆటగాళ్ల పనిభారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం. ఇప్పుడు బీసీసీఐ మరో అడుగు ముందుకేసింది.. ప్రముఖ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. కాబట్టి అతను తిరిగి భారత జట్టుతో కలిసి పని చేస్తాడు.
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సహాయక సిబ్బందిలో ప్యాడీ ఆప్టన్ కీలక సభ్యుడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో స్వల్పకాలిక ఒప్పందంపై టీమ్ ఇండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 'వెస్టిండీస్‌తో బుధవారం జరిగే మూడో వన్డేలో పాడీ ఆప్టన్ భారత జట్టులో చేరనున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అతను కొనసాగనున్నాడు. ఇది తాత్కాలిక ఏర్పాటు' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆప్టన్ వివిధ IPL జట్లకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేశాడు.