కావలసిన పదార్ధాలు : కరివేపాకు - గుప్పెడు, జీలకర్ర - 2స్పూన్లు , వెల్లుల్లి - 4, చింతపండు - 50గ్రా, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - 3, నూనె - తగినంత, తాలింపు దినుసులు - 1స్పూన్.
తయారీవిధానం:
-- ముందుగా చింతపండును ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఆపై చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-- ఇప్పుడు కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిని మిక్సీ జార్లోకి తీసుకుని, నీళ్లు వెయ్యకుండా మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
-- స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి.
-- నూనె బాగా వేడెక్కాక తాలింపు దినుసులు వేసి వేపాలి. ఆపై అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ , బారుగా కోసిన పచ్చిమిర్చి వేసి ఐదు నిముషాలు వేపుకోవాలి.
-- తర్వాత అందులో చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి పావుగంట మరగబెట్టుకోవాలి.
-- రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే, కరివేపాకు రసం రెడీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa