గత వారం అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్5బీ రాకెట్ శిథిలాలు భూమి వైపుకు దూసుకొస్తున్నాయి. మరో 4 రోజులలో ఇవి భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని, వీటి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ తీసుకెళ్ళింది.