సీనియర్ న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసు కేసుల్లో ముస్లింల తరపున వాదిస్తున్నారు. హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన ఆయనను వెంటనే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబిలిటీ (వినడం, వినకపోవడం) అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు ముగించాయి. ఈ నెల 4న ముస్లిం పక్షం నుంచి జవాబు రావాల్సి ఉంది. ముస్లిం తరపు నుంచి న్యాయవాది అభయ్‌నాథ్ ఈ కేసుల్లో ముఖ్య పాత్ర పోషించారు.