లారీ ఢీకొనడంతో మహిళ దుర్మరణం పాలైన సంఘటన ఆరిలోవ సమీపంలో చోటుచేసుకుంది. ఎంవిపి కాలనీకి చెందిన బి పుష్ప, భర్త గత మూడు నెలలుగా ఆరిలోవ బి ఆర్ టి ఎస్ రోడ్డు పక్కన గల అపోలో ఆసుపత్రిలో కోమలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో మంగళవారం ఉదయం అపోలో ఆసుపత్రిలోని భర్తను పరామర్శించి, తిరిగి ఇంటికి పుష్ప బయలుదేరింది.
సమీపంలోని బీఆర్టిఎస్ రోడ్డును ఆమె దాటు తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. సంఘటనలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ఆమె దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికి తరలించారు. ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.