కంచరపాలెం పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరాయమట్ట సమీపంలోని మురళి నగర్ లో నివాసముంటున్న పెద్దింటి మణికుమార్ (28) మంగళవారం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.