అడుగడుగునా హారతులు, పూల వర్షం కురిపిస్తున్న ప్రజలు గాజువాక నియోజకవర్గపరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 73వ వార్డులొ నిర్విరామంగా కొనసాగుతుంది. సింహగిరి కాలనీలో కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి , జీవీఎంసీ కమిసనర్ లక్ష్మీ షా, ఇంచార్జి దేవన్ రెడ్డి కి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రతీ గడపకు వెళ్లి ఈ మూడేళ్ళ పాలనలో ప్రజలకు ఎంత లబ్ది చేకూర్చామో వివరిస్తూ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిసనర్ లక్ష్మీ షా, ఇంచార్జి దేవన్ రెడ్డి లబ్ధిదారులకు వివరించారు.
గడప గడపకు కార్యక్రమంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఎమ్మెల్యే నాగిరెడ్డి , కమిసనర్ లక్ష్మి షా సచివాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, జీవీఎంసీజోనల్ కమిసనర్ పొందూరు సింహాచలం, జీవీఎంసీ సిబ్బంది, వైసీపీ నాయకులు భూపతి రాజు శ్రీనివాస్ రాజు, కంది పైడి నాయుడు, విశ్వనాధ వర్మ, పిల్లా సూర్య కుమారి, కర్రీ ప్రసాద్, భగవాన్, రామ కృష్ణ రాజు, శంకర్, కొండ పల్లి లక్ష్మి, పద్మ, వర లక్ష్మీ, కమల్ , అలీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.