శారదా నది లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఆత్మహత్య చేసుకోకుందా లేక ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిందా లేక ఎవరైనా కొట్టిపడేశారా అన్న అనుమానాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన కనిశెట్టి అచ్చి యమ్మ(47) తగరం పూడి కట్ట వద్ద శారదా నది లో శవమై తేలింది. సోమవారం బయటకు వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం చనిపోయి కనిపించింది.
స్థానికుల సమాచారంతో చోడవరం ఎస్ ఐ విభూషణ రావు తాహసీల్దార్ తిరుమల బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. కనిశెట్టి అచ్చ యమ్మ గా గుర్తించి కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి భర్త జగ్గారావు గతంలో మృతిచెందాడు. వారికి పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె శారదా నది లో శవమై స్థానికులకు కనిపించింది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.