చాలా మందికి ముఖంపై నల్ల మచ్చలు ఉంటాయి. అయితే నిమ్మకాయ సహాయంతో ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోతాయి. నిమ్మకాయలోని విటమిన్ 'సి' చర్మంపై మచ్చలతోపాటు మురికి, జిడ్డును తొలగిస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని అందులో దూదిని ముంచి నల్లమచ్చలపై మెత్తగా రుద్దాలి. 30 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు పోతాయి.