మనం రుణం తీసుకొనే ముందు అది ఏ రూపంలో తీసుకొంటే మంచిది అన్న చర్చ ఎంతో అవసరం. ఎందుకంటే వివిధ రుణాలుకు వివిధ రకాలుగా వడ్డీ రేటు ఉంటుంది. మీ ఇంటికి మరమ్మత్తులు చేయించుకోవాలన్నా లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఏ ఇతర వ్యక్తిగత అవసరానికైనా డబ్బులు అవసరం అవుతుంటాయి. చేతిలో డబ్బులు లేని చాలా మంది అప్పుడు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు చూస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో వ్యక్తిగత రుణం తీసుకోవడానికి బదులుగా అప్పటికే తీసుకున్న రుణానికి టాప్-అప్ లోన్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. మీకు బ్యాంకులో హోమ్ లోన్ ఉంటే.. దానిపై టాప్-అప్ లోన్‌ను తీసుకోవచ్చు. అలాగే వెహికిల్ లోన్ ఉంటే.. దానిపై కూడా టాప్-అప్ తీసుకోవచ్చు. నేడు ఈ టాప్-అప్ లోన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం..
అయితే వ్యక్తిగత రుణాలకు బదులుగా టాప్-అప్ లోన్లు తీసుకోవడానికి ప్రధాన కారణం ఈఎంఐలు. వ్యక్తిగత రుణాలు తీసుకుంటే.. మీరు అత్యధికంగా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదే టాప్-అప్ లోన్ అయితే వడ్డీ రేటు కాస్త తగ్గుతుంది. దీంతో మీరు ఈఎంఐను కూడా తక్కువగా చెల్లించవచ్చు. వ్యక్తిగత రుణాలకు మీరు ప్రతి నెలా 12-25 శాతం మధ్యలో వడ్డీలు చెల్లించాలి. అప్పటికే రుణం తీసుకుని ఆ అప్పు కడుతున్న వారికి ఇది నిజంగా పెద్ద సవాలే. ఇదే సమయంలో మీరు ఆటో రుణం లేదా ఇంటి రుణంపై టాప్-అప్ లోన్ తీసుకుంటే.. మీరు అదనంగా 8 శాతం నుంచి 10 శాతం మధ్యలోనే వడ్డీ రేట్లు చెల్లించుకోవచ్చు. ఆటో లోన్ ఏ రేటుకైతే పొందారో అదే రేటుకు ఈ లోన్ కూడా లభిస్తుంది.
టాప్-అప్ లోన్ ఎక్కడ తీసుకోవాలి..?
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆటో లోన్లపై టాప్-అప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ టాప్-అప్ లోన్‌కి దరఖాస్తు చేసుకోవడం కూడా తేలికనే. ఏ బ్యాంకులో లేదా ఆర్థిక సంస్థలో అయితే మీరు ఆటో లోన్ తీసుకున్నారో, అక్కడ మీరు టాప్-అప్‌ను అప్లయి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే టాప్-అప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి లోన్లకు ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.
టాప్-అప్ లోన్ ఎప్పుడిస్తాయి..
ప్రస్తుత లోన్ కస్టమర్లు ఎవరైతే సమయం లోపల బ్యాంకులో ఈఎంఐలను డిపాజిట్ చేస్తారో వారికి మాత్రమే బ్యాంకులు టాప్-అప్ లోన్లను ఇస్తాయి. చాలా బ్యాంకులు ప్రస్తుతం ఆటో లోన్లపై టాప్-అప్ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. మీకు ఎంత లోన్ లభిస్తుందన్నది.. వాల్యూయేషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ వెహికిల్ మార్కెట్ వాల్యూ ఆ సమయంలో ఎంతైతే ఉందో.. దాన్ని బట్టి టాప్-అప్ లోన్‌ను నిర్ణయిస్తాయి బ్యాంకులు. అంతేకాక.. వెహికిల్ కోసం ఎంత లోన్ మీరు తీసుకున్నారో కూడా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు చూస్తాయి.