భారత్‌కు మరో బంగారు పతకం లభించింది. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరోసారి గోల్డ్ మెడల్ సాధించేందుకు తన సత్తా చాటాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో ఫైనల్లో కెనడాకు చెందిన లాచలన్ మెక్‌నీల్‌పై 2-9 పాయింట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.