ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలందరి దృష్టి చిలీ దేశం వైపే ఉంది. అందుకు కారణం.. ఆ దేశంలో అల్కాపరోసా గని సమీపాన కొద్ది రోజుల క్రితం దాదాపు 656 అడుగుల లోతు, 82 అడుగుల చుట్టుకొలతతో భారీ గొయ్యి ఏర్పడింది. రాత్రికి రాత్రే ఏర్పడిన ఈ గొయ్యి ఎలా ఏర్పడిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ సింక్‌హోల్ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఆ ప్రాంతంలోని మైనింగ్‌ను ప్రభుత్వం తాత్కలికంగా ఆపేసింది.