ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటకంతో భారత్ కు మంచి భవిష్యత్తు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 09:19 PM

పర్యాటకంతో భారత్ కు ఆర్థికంగా మంచి భవిష్యత్ ఉందని ఓ నివేదిక తెల్చింది. రాబోయే రెండేళ్లలో భారత్ నుంచి జరిగే అంతర్జాతీయ పర్యాటకం విలువ రెట్టింపు కానుందని ఆ నివేదిక చెబుతోంది. భారత అంతర్జాతీయ పర్యాటకం విలువ 2024 నాటికి రూ.30 లక్షల కోట్లు దాటనుందని అంచనా. పర్యాటక మార్కెట్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి మరింత ఊపునిచ్చేందుకు కేంద్రం కొన్ని విధానపరమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు. 'అవుట్ బౌండ్ ట్రావెల్ అండ్ టూరిజం-యాన్ ఆపర్చునిటీ అన్ ట్యాప్డ్' పేరిట నంగియా ఆండర్సన్ ఎల్ఎల్పీ, ఫిక్సీ సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. 


రాకపోకలతో కూడిన భారత పర్యాటక మార్కెట్, భారత పర్యాటకులు, ప్రయాణికులు తాము ఖర్చు చేసే డబ్బుకు తగిన సేవలు పొందడం తదితర అంశాలపై ఈ నివేదికలో సూత్రప్రాయంగా వివరించారు. ప్రముఖ పర్యాటక స్థలాలతో ప్రభుత్వం నేరుగా సంబంధాలు నెరపడం, విదేశీ విహార నౌకలను భారత సముద్ర జలాల్లోనూ అనుమతించడం వంటి అంశాలను కూడా ఈ నివేదికలో స్పృశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com