మైదుకూరు కు చెందిన ఇంగ్లీష్ అధ్యాపకుడికి భారత్ వర్చ్యువల్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గత 32 ఏళ్లుగా సరళమైన, సులభతరమైన ఆంగ్ల భాషను బోధిస్తున్నందుకు ఆయనకు ఈ డాక్టరేట్ ను ఇస్తున్నట్టు యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అశోకహోటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాల్గొన్న పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీ డీన్, భారత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాధా రామ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. రాధారామ్ కు డాక్టరేట్ రావడం పట్ల మైదుకూరు లోని ప్రభత్వ డిగ్రీ కాలేజి, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.