శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇంధన సమస్య కూడా శ్రీలంకను వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ దేశం విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం, మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లో ఉందని ఆ దేశ మీడియా తెలుపుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదు. మరికొంతకాలం ఇదే దుస్థితి ఉండనుంది.