తాడిపత్రి: మండల పరిధిలోని కోమలి గ్రామంలో బుధవారం స్కూటర్ ఢీకొని గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన ఓబుళపతి అనే వ్యక్తికి చెందిన గేదెను పెద్దపప్పూరు వైపు నుంచి అతివేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిందపడ్డారు. గ్రామస్థులు ఎక్కడ తమను కొడతారోనని, వారు అక్కడే బైక్ వదలి పరారయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa