ఏపీలోని వైసీపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. మధ్యవర్తిత్వం కోసం నార్మన్ ఫోస్టర్ కంపెనీ పిటిషన్ వేయగా.. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రో పాలిటిన్ రీజియన్ డెలవప్‌మెంట్ అథారిటీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణం కోసం ఫోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది.. అప్పటి ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో.. అమరావతి పనులు నిలిచిపోయాయి. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం పోస్టర్ కంపెనీ జగన్ సర్కార్‌కు నోటీసులు పంపింది. 2019 జూన్ తర్వాత నుంచి బకాయిలపై పలుమార్లు లేఖలు రాశామని.. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవంతో ఫోస్టర్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు విచారణ జరిపి నోటీసులు జారీ చేసింది.