ఆదివారంనాడు ఎమ్మెల్యే శ్రీదేవి గుంటూరులోని ఆమె నివాసంపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఊరూరా ఘనంగా నిర్వహించి జాతి నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.