ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్ద నల్ల కాలువ జడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. ఫుల్లుగా మద్యం సేవించి పాఠశాల ఆవరణలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఇక తరగతి గదులలో మల మూత్రం విసర్జన చేసి గలీజు చేశారు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కావాలని చేసి ఉంటారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశారు.