జిల్లా పునర్విభజన జరిగిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డిగారు తొలిసారిగా ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనకు వెచ్చేస్తున్నారని , బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా చేయాలని గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ గారు అధికారులను కోరారు .
మంగళవారం పెడన మార్కెట్ యార్డ్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాకా సందర్భంగా జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు . ఈ సమావేశంలో గౌరవ శాసన సభ్యులు పేర్ని వెంకటరామయ్య ( నాని ) గారు , గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం గారు , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , ఎస్ . పి . జాషువా గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాలగారు , జిల్లా అధికారులు పాల్గొన్నారు .
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డివిజనల్ పంచాయతీ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు . బహిరంగ సభ జరిగే ప్రాంతంలో డీ - సర్కిల్ లో ప్రత్యేక వై . ఎస్ . ఆర్ . నేతన్న నేస్తంపై ప్రత్యేక ముగ్గు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa