దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలు పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అనంతబాబు గత 86 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు నిందితుడిపై ఇంతవరకు ఛార్జ్ షీటు దాఖలు చేయలేదు. అయితే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం బెయిలు మంజూరయ్యే అవకాశముంది.