ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరియాలతో అధిక బరువును తగ్గించుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 11:55 AM

మనం మిరియాలను వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తాం. వీటితో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఘాటును కోరుకునే వారు మిరియాలను వాడవచ్చు. అయితే మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. మిరియాలతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మిరియాలను తీసుకుని వాటిని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే బరువు త్వరగా తగ్గుతారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. అలా చేస్తే అధిక బరువు తగ్గుతారు. మార్కెట్‌లో దొరికే బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. అలా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. అర కప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకుని వాటిని కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తాగితే ఫలితం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com