రాజస్థాన్ లో 4 లక్షలకుపైగా పశువులు లంపీ స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. సుమారు 18వేలకుపైగా మూగజీవాలు చనిపోయినట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్కడ 15 జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉందని, ఈ చర్మవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గోషాలల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అశోక్ గహ్లోత్ ఆదేశించారు. వ్యాధి నివారణకు ప్రత్యామ్నాయ ఔషధాలను అందిస్తున్నామని చెప్పారు.