అమరావతి రైతులు మరోసారి మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది తుళ్లూరు నుంచి తిరుపతికి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa