ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరాలో త‌మ‌న్నా పాత్ర ఏంటంటే...

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2019, 09:39 AM

మెగా స్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకరంగా తీసుకుని న‌టించిన‌ సైరా ట్రైలర్  విడుదలై అన్ని వ‌ర్గాల‌లో విశేష స్పందన అందుకుంటోంది.  ట్రైలర్లో క‌నిపించిన అబ్బురపరిచే విజువల్స్, అద‌ర‌గొట్టే డైలాగులు,  వీరోచిత పోరాటాలు, సామాన్య ప్రేక్ష‌కుడిని సైతం సినిమా ప‌ట్ల  ఆసక్తి చూపేలా సాగిందన‌టంలో సందేహం లేదు. మొత్తానికి చిరంజీవి త‌న నట విశ్వరూపం  ఆవిష్క‌రించిన‌ట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. కాగా ఈ సినిమాలో   నయనతార, తమన్నాలు కీల‌క భూమిక‌లు పోషించారు. నయనతార నరసింహారెడ్డి భార్య పాత్ర చేస్తున్నారు.నరసింహారెడ్డి భార్యగా లేదా ఆయన భార్య కావాలని తపించే యువతి ల‌క్ష్మిగా తమన్నా పాత్ర ఉంటుందన్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ‘లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు’ అని టైల‌ర్‌లో త‌మ‌న్నా అడిగే స‌న్నివేశం చూస్తుంటే  చిత్రంలో తమన్నా పాత్ర ఆసక్తిని రేపేలా అధికప్రాధాన్యం ఉంటుందనిపిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.   బాహుబలి విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన త‌మ‌న్న మ‌రోమారు   సైరా లో  కీలకపాత్ర  ద్వారా  అటు ఎమోషన్స్ తోపాటు ఇటు వీరోచిత సన్నివేశాలలో అలరించేలా ఉండ‌బోతున్నాయ‌ని కొంద‌రి మాట‌. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa