ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవ‌త‌లో బిందెల పాట ఐడియా ద‌ర్శ‌కేంద్రుడికి ఎలా వ‌చ్చిందంటే...

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2019, 09:58 AM

మూడున్న‌ర ద‌శాబ్దాల క్రితం విడుద‌లైన దేవ‌త చిత్రంలోఎవర్ గ్రీన్ సాంగ్ “వెల్లువొచ్చి గోదారమ్మ…,” మ‌రోమారు తెలుగురాష్ట్రాలలో సంద‌డి చేస్తోంది. అప్ప‌ట్లో రాఘ‌వేంద్రుని ద‌ర్శ‌క‌త్వంలో భారీగా బిందెలు వాడి గోదారి అందాల న‌డుమ శ్రీదేవి, శోభన్ బాబు జంట‌పై చిత్రీక‌రించిన ఈ పాట తాజాగా  వరుణ్ తేజ్   వాల్మికీలోను రీమిక్స్  చేయ‌టం, ఆ పాట ఆవిష్క‌ర‌ణ రాఘ‌వేంద్రుడే చేయడం విశేషంగా చెపుతున్నాయి సినీ వ‌ర్గాలు.
ఈ సంద‌ర్భంగా ఈ ఈ పాట చిత్రీకరణ పై గ‌త జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  “వెల్లువొచ్చి గోదారమ్మ…,” పాటను  గోదావరి నదిలోని ఇసుక దిబ్బపై చిత్రీకరించాలని భావించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇందుకు సంబంధించిన లొకేష‌న్ల‌ని చూసేందుకు వెళ్లారు. లొకేష‌న్ షురూ చేసుకుని తిరిగి వ‌స్తు, అక్క‌డ ఉన్న ఓ దాబాలో కాస్త సేద తీరేందుకు బైట వేసిన నుల‌క మంచంపై ప‌డుకున్న త‌న‌కి ఠంగ్‌... ఠంగ్ అంటూ వ‌రుస‌గా శ‌బ్ధాలు వినిపించాయ‌ని, ఇదేంట‌ని దాబా య‌జ‌మానిని అడిగితే ఈ గ్రామం కంచు బిందెల త‌యారీకి ఫేమ‌స్స‌ని చెప్పాడ‌ట‌. దీంతో ఈ పాట‌లో బిందెలు వాడితే ఎలా ఉంటుంద‌ని ఆలోచించి, పాట చిత్రీక‌ర‌ణ‌కు అన్ని బిందెలు కొన‌టం అంటే నిర్మాత‌కూ అసాధ్య‌మైన విష‌యం క‌నుక అద్దెకు ఇచ్చేందుకు ముందుకొస్తారేమో? క‌నుక్కోమ‌న్నాన‌ని, ఈ బిందెల మ‌ధ్య శోభ‌న్‌బాబు, శ్రీ‌దేవి డాన్స్ చేస్తార‌ని చేప్పమ‌న్నాన‌ని చెప్పారు. దాబా య‌జ‌మాని చొర‌వ‌తో ఇద్ద‌రు బిందెల త‌యారీ దారులు ముందుకొచ్చి కేవ‌లం నాలుగు రోజుల‌లో వంద‌లాది బిందెలు గోదారి ఒడ్డుకు చేర్చ‌డ‌మే కాకుండా క‌ళాద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టు అవి నిల‌ప‌డంలోనూ స‌హ‌క‌రించార‌ని, వీటికి అద్దె రూపంలో కొంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాత రామానాయుడు సిద్ద‌మైనా వాళ్లు తీసుకోలేద‌ని గుర్తు చేసుకున్నారు.
అలాగే  ఈపాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో  చిత్ర యూనిట్ చిన్న నీటి పాయ దాటాల్సివచ్చేద‌ని,  గోదావరి వొడ్డునే మేకప్ ,  కాస్ట్యూమ్స్ తో సిద్దమైపోయేయే శ్రీ‌దేవిని  ఎవరో ఒకరు ఆమెను ఎత్తుకొని ఆ చిన్న పాయ దాటించాల్సిన పరిస్థితి. నిర్మాత రామానాయుడు హీరో శోభన్ బాబుని ఎత్తుకోమని అడుగగా…,ఆయన నా వల్లకాదన్నారట. ఇక ఆ బాధ్యత నాకైతే త‌ప్ప‌లేద‌ని ఆ పాట చిత్రీకరణ పూర్తయిన మూడు నాలుగు రోజులు  శ్రీదేవిని ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాన‌ని ద‌ర్శ‌కేంద్రుడు ఆ పాట‌ని గుర్తు చేసుకున్నారు.
తాజాగా వాల్మీకిలో కూడా అదే స్థాయిలో చిత్రీక‌ర‌ణ క‌నిపిస్తోంద‌ని, నిర్మాత‌ల‌కు ఆ బిందెల‌న్నీ లంకెల బిందెలు కావాల‌ని త‌ను ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa