హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్' విడుదలై ఇప్పటికి సరిగ్గా వారం అవుతోంది. డీసెంట్ రివ్యూస్.. మాస్ ఆడియన్స్ అండదండలతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది. మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.17 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వానల కారణంగా 'గద్దలకొండ గణేష్' కలెక్షన్స్ కాస్త తగ్గాయని.. లేకపోతే ఈ కలెక్షన్ ఫిగర్ మరికొంత మెరుగ్గా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య మీడియం రేంజ్ సినిమాలకు సోమవారం కలెక్షన్స్ తీవ్రంగా డ్రాప్ కావడం సాధారణంగా మారింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ సోమవారం టెస్టుకు నిలబడలేకపోతున్నాయి. కానీ 'గద్దలకొండ గణేష్' మాత్రం ఆ టెస్టును పాస్ కావడం విశేషం. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి మెజారిటీ ఏరియాలు బ్రేక్ ఈవెన్ అవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు దాదాపు లేవని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa