సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. ‘బలగం’ చిత్రంతో సంచలనం సృష్టించిన వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం నెలలో కేవలం పది రోజులు మాత్రమే కేటాయించేలా నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ స్వయంగా వెల్లడించాడు.నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ప్లాన్ చేశాడు. అయితే, తన తండ్రి మరణించడంతో ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేకపోయానని, అందుకే అది ఆగిపోయిందని డీఎస్పీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సుకుమార్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు వంటి వారు తనను ఎప్పటినుంచో నటన వైపు ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa