ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మీడియా ముందుకు అషు రెడ్డి!

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2026, 12:50 PM

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డిపై వస్తున్న చీటింగ్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అషు రెడ్డి, ఇప్పుడు ఈ ఆరోపణలపై గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న ఆధ్యాత్మిక పర్యటనలో గడిపిన ఆమె, రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వివాదం ముదురుతుండటంతో ఆమె తండ్రి కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. తండ్రీకూతుళ్లిద్దరూ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈరోజు అషు రెడ్డి తన తండ్రితో కలిసి మీడియా ముందుకు వచ్చి, అసలు ఏం జరిగింది, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అనే విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa