యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో చిత్ర కథానాయకుడిగా శ్రీవిష్ణు మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇక ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం తో దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ఒక వినూత్నమైన కథతో సినిమా తీయాలని అనుకున్నామని, తాము అనుకున్న విధంగా మంచి కథ లభ్యం కావటంతో ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది.చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి సహ నిర్మాతలుగావ్యవహరిస్తున్న వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి కూడా ఈసమావేశంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa