ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంచన గెటప్ లో హీరో అక్షయ్....

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 12:34 PM

తెలుగు తమిళ భాషలలో లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన కాంచన హారర్ కామెడీ సిరీస్ ఎంత విజయవంతమైదో తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్పటికే లారెన్స్ నాలుగు చిత్రాలు చేయగా అన్నీ ఆదరణ దక్కించుకోవడం గమనార్హం. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఈ సిరీస్ లో వచ్చిన కాంచన 2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా రానుంది. కాగా ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు అక్షయ్ హిజ్రా గెటప్ లో ఉన్న మరో స్టిల్ విడుదల చేయడం జరిగింది. కాళీ మాత గుడిలో ఎర్ర చీర ధరించి, ముఖాన పెద్ద బొట్టుతో ఉన్న అక్షయ్ లుక్ ఆసక్తిగొలిపేలా ఉంది. లక్ష్మీ బాంబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa