ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ హైపర్ ఆది కి ముద్దుల ఆఫర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 12:53 PM

'జబర్దస్త్' తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని షో.. అయితే ఈ గురువారం వస్తున్న జబర్దస్త్, షోలో బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి కూడా నటించబోతోంది. ఆదికి భార్యగా రోహిణి నటించింది. అటు.. రాకెట్ రాఘవ, అదిరే అభి కూడా తమ స్కిట్లతో అలరించారు. దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో కూడా ఓ రేంజ్‌లో ఉన్నది . హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాత్రలో హైపర్ ఆది కిరాక్ పుట్టించే కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


స్కిట్‌లో భాగంగా.. హైపర్ ఆది తన భార్య(రోహిణి)ను ఓ ముద్దు ఇవ్వు అని అడగ్గా ఆమె ఇవ్వనని తెగేసి చెబుతుంది. అక్కడున్న యాంకర్ అనసూయ మధ్యలో కలగజేసుకొని ఆది.. నేను ఇస్తాను రా అంటూ పిలిచింది. వెంటనే అనసూయ నేనొస్తున్నా అంటూ వెళ్లగానే.. ఏదో ఫ్లోలో అన్నాను.. వద్దు దగ్గరికి రావొద్దంటూ నవ్వులు పూయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa