ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజ్ఞాతంలో జనసేనాని.. ఎందుకో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 02:04 PM

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక దీర్గకాలిక బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి వెన్నునొప్పి వుంది. ఈ విషయంలో ఆయనతో క్లోజ్ గా మూవ్ అయ్యే అందరికీ తెలుసు. చాలాసార్లు షూటింగ్స్ లో ఆయన ఇబ్బంది పడ్డ సందర్భాలు వున్నాయి. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయేవారు పవన్ కళ్యాణ్. అయితే ఈ విషయం మాత్రం పబ్లిక్ కి తెలియదు. కానీ మొన్న స్వయంగా పవన్ కళ్యాణ్ నే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన వెన్నునొప్పి గురించి చెప్పారు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ బయటకనిపించడం లేదు కూడా.


దీనికి కారణం.. చాలా రోజులుగా నెట్టుకొస్తున్న ఈ భాద నుండి పూర్తి విముక్తి పొందాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని డాక్టర్స్ చెప్పినప్పటికీ ఆయన మాత్రం కేరళ నేచురల్ వైద్యంని ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యణ్ ఎవరికీ అందుబాటులో లేకుండా వైద్యంలో వున్నారని అందుకే ఆయన ఎక్కడా ఎప్పియర్ అవ్వడం లేదని భోగట్టా. అయితే ఆయన ట్విట్టర్ అకౌంట్ మాత్రం యాక్టివ్ గా వుంది. మరో వారం రోజులు పాటు ఆయన ఈ వైద్యంలో ఉంటారని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa