ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలైకా అరోరా లేటెస్ట్ ఫొటో షూట్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 04:30 PM

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మళ్లీ ఫొటో షూట్‌తో రెచ్చిపోయారు. మాజీ భర్త అర్బాజ్ ఖాన్ సోదరుడి భార్య సీమా ఖాన్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ మలైకా ముందుకొచ్చారు. సీమా డిజైన్ చేసిన లెహెంగాలు ధరించి మలైకా హాట్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. కట్ బ్లౌజ్‌లు ధరించి ఎప్పటిలాగే తన జీరో ఫిగర్ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.


నాలుగు పదుల వయసులో ఇంత ఫిట్‌గా ఉంటూ గ్లామర్‌ను మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. ఇలా ఉండేందుకు మలైకా క్రమం తప్పకుండా యోగా చేస్తారు. క్లిష్టమైన యోగాసనాలు వేస్తారు. ఈ వయసులో ఆ ఆసనాలు వేయడం అంత సులువేం కాదు. ఫిట్‌నెస్ విషయంలో మలైకా ఎందరికో రోల్ మోడల్. తన ఫాలోవర్స్‌కు యోగాకు, డైట్‌కు సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు.మలైకా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే ఫిగర్‌ను మెయింటైన్ చేస్తున్నారు. 1990ల్లో వచ్చిన ‘దిల్ సే’ సినిమాలోని ‘ఛయ్య ఛయ్య’ పాటతో మలైకా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ పాటతో ఆమె చాలా పాపులర్ అయిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఐటెం సాంగ్స్‌లోనే నటిస్తున్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించని ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ‘కెవ్వు కేక’ అనే ఐటెం సాంగ్‌లో మెరిశారు.


ఐటెం సాంగ్స్‌తో పాటు ఆమె ర్యాంప్ వాక్స్ కూడా చేస్తుంటారు. ఇండియాకు చెందిన టాప్ ఫ్యాషన్ డిజైనర్ల కోసం ఎన్నో సార్లు ర్యాంప్ వాక్స్ చేశారు. కానీ మలైకా విషయంలో ఆమె కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌‌ను వివాహం చేసుకుని అతనితో ఓ పిల్లాడిని కన్న 17 ఏళ్ల తర్వాత మలైకా తన భర్తతో విడిపోయారు. ఆ తర్వాత తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ఇటీవల మీడియా ద్వారా ప్రకటించారు. త్వరలో మలైకా, అర్జున్ పెళ్లి చేసుకోబోయే అవకాశాలు ఉన్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa