ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్యతో పోటీకి సిద్ధం అవుతున్న సాయి ధరమ్ తేజ్..!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2019, 06:23 PM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వినోదభరిత సినిమాల దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యామిలీ డ్రామా ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్. ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. కాగా, అదే రోజు నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దర్శక నిర్మాతలు ఇంకా విడుదల తేదీ ప్రకటించనప్పటికీ డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కాబట్టి, బాలయ్యతో తేజూ సై అనడం ఖాయంలా కనిపిస్తోంది. నిజానికి వీరిద్దరి మార్కెట్ ఇంచుమించుగా ఒకేలా ఉంది. బాలకృష్ణ సీనియర్ హీరోనే అయినా ఆయనకు పోటీనిచ్చే సత్తా సాయి తేజ్‌లో ఉంది. కాబట్టి, ఈ రెండు మధ్య బాక్సాఫీసు వద్ద పోరు ఆసక్తికరంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa