కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఇటీవలే కొబ్బరికాయ కొట్టించుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు చిత్ర వర్గాలు చెపుతుండగా. ఇందులో చిరంజీవి సరసన యనతార, అనుష్క పేర్లు వినిపించిన త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం. చిరంజీవితో గతంలో `స్టాలిన్` సినిమాలో త్రిష నటించిన విషయం విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్రత్యేక సెట్ కూడా రూపొందించినట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa