మహానటి చిత్ర నిర్మాతలు ఓ వినూత్నమైన చిత్రాన్ని ప్రకటించిన ఆశ్చర్య పరిచారు. ‘జాతిరత్నాలు’ అనే విభిన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. జాతీయ అవార్డు విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారు. కాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హిలేరియస్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మితం అవుతుంది. ఇప్పటికే డెబ్భై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి ఈ మధ్య ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రియదర్శి, రాహుల్ హీరో శ్రీవిష్ణు తో చేసిన ‘బ్రోచేవారెవరురా’ మూవీ కూడా మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa