నాగార్జున హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. దీంతో రోజుకో కొత్త టాస్క్‌తో రసవత్తరంగా సాగుతోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ సీజన్ 3 షో టైమింగ్స్ మారబోతున్నాయి. మామూలుగా బిగ్ బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ.. రోజూ.. రాత్రి 9.30 గంటల నుంచి 10.30 గంటలకు ప్రసారం అవుతోంది. వారాంతాలైన శని, ఆది రోజుల్లో మాత్రం రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతోంది. కాగా వచ్చే వారం నుండి ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ.. రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా.. శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకే ప్రసారం అవనుంది. అయితే సడన్‌గాా టెలికాస్ట్ సమయాల్లో ఈ మార్పులకు కారణం ఎంటంటే.. మాటీవీలో ప్రసారం అయ్యే.. కొన్ని సీరియల్స్ షెడ్యూల్ స్లాట్‌లలో మార్పులు జరిగాయి. ఈ కారణంతో బిగ్‌బాస్ షో టైమింగ్స్ మారాయని తెలుస్తోంది. కాగా బిగ్ బాస్‌లో ఇప్పటికే రాహుల్ సేఫ్ అయ్యి.. టాప్ ఫైవ్‌లోకి రాగా... ఈ వారం ఏవరు ఎలిమినేట్ అవుతారో అని తెగ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.. బిగ్ బాస్ అభిమానులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa