ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్టేక్ – ఒక తప్పు టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 01:44 AM

 సంతోష్ చరణ్ దర్శకుడిగా, వికాస్ దేవరకొండ సినిమాటోగ్రాఫర్ గా న్యూ జీల్యాండ్  లో ప్రవాస తెలంగాణ వాసులు నిర్మిస్తున్న‌ మిస్టేక్ – ఒక తప్పు అనే థ్రిల్లర్  ఆంగ్ల‌ చిత్రం తెరకెక్కింది.  శుక్ర‌వారం  ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది.   ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్  శరవేగంగా జరుపుకొని  న్యూ జీల్యాండ్, ఫిజి దేశాలలో డిసెంబర్ నెల మొదటి వారంలో  విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం లో  న్యూ జీల్యాండ్, ఫిజి నటి, నటులు ముఖ్య భూమికలు పోషించారు. ఒక ఆగంతకుడు/ఉన్మాది , ఒక మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమెను భయ భ్రాంతులకు గురి చేసి బంధిస్తాడు. అనంతరం మహిళా ఎలా ఉన్మాది పైన పోరాటం చేసి ప్రాణాలు కాపాడుకుంటుందనే కథాంశం తో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు  గురి చేసే విధంగా  రూపొందించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర సంగీత దర్శకుడిగా విజయ్ కురకాల వ్యవహరిస్తున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa