పెళ్ళి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండ రీసెంట్‌గా అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో కన్నడ నటి రష్మిక మందనతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా ఏ టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే రష్మిక ఒక వైపు ఈ ప్రాజెక్ట్ చేస్తూనే మరో వైపు పలు కన్నడ చిత్రాలలోను నటిస్తుంది. ఈ అమ్మడు నటించిన కన్నడ చిత్రం చమక్ డిసెంబర్ 4న సాయంత్రం 6గంటలకు ఆడియో వేడుక జరుపుకోనుండగా, ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ అతిధిగా హాజరు కానున్నాడట. ఈ విషయాన్ని రష్మిక తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేసింది. చమక్ చిత్రంలో గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa