సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్రబృందం క్లారిటీగా ఉందని ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇక బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa