ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలీవుడ్ సినిమాల పై దృష్టిపెట్టిన 'మజిలీ' భామ!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2019, 05:44 PM

దివ్యాన్ష కౌశిక్ 'మజిలీ' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో కుర్రకారు మనసులు దోచేస్తూ చాలా సహజంగా ఆమె చేసిన నటన కళ్లముందు కదలాడుతుంది. అయితే ఆ సినిమా హిట్ సమంత ఖాతాలో పడిపోయింది. ఆ కారణంగా దివ్యాన్షను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కొంతకాలం పాటు వేచి చూసిన ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడికి వెళ్లి చేసిన ప్రయత్నాల కారణంగానే ఆమెకి 'టక్కర్' సినిమాలో ఛాన్స్ తగిలింది. సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. అంతేకాదు కోలీవుడ్లో తాను నిలదొక్కుకుంటాననే ఆశతో ఈ అమ్మాయి ఉందట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ రెండు భాషల నుంచి ఆమెకి ఆఫర్లు పెరిగే అవకాశాలైతే వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa